అధికార పక్షంవాళ్ళు మజిల్ పవర్ చూపిస్తున్నారు – పవన్ కళ్యాణ్

Tuesday, February 16th, 2021, 11:06:08 PM IST

జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల పై స్పందించారు. ఈ మేరకు జన సేన కైవసం చేసుకున్న స్థానాల గురించి, ఎన్నికల విషయం లో అధికార పార్టీ తీరు పట్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గణాంకాలే చెబుతున్నాయి గ్రామాల్లో జన సేన బలంగా ఉందని అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జన సేన పార్టీ మద్దతు దారులతో మార్పు మొదలైంది అని, అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకొని నిలిచారు అంటూ చెప్పుకొచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి అధికార పార్టీ వాళ్లు భయపడుతున్నారు అని, తొలి రెండు దశల్లో చూపిన స్ఫూర్తిని మలి దశల్లోనూ చూపించాలి అంటూ జన సేన పార్టీ ద్వారా వెల్లడించారు.

మొదటి విడతలో 18 శాతానికి పైగా ఓట్లు వస్తే, రెండవ విడత లో 22 శాతానికి పెరిగింది అని,పార్టీ భావజాలం, మద్దతు తో 250 కి పైగా సర్పంచ్ మరియు 1500 వార్డ్ లను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. జన సేన మద్దతు దారులతో మార్పు మొదలైంది అని,మార్పు మొదలయ్యెప్పుడే భయ పెడతారు అని, అధికార పక్షం వాళ్లు మజిల్ పవర్ చూపిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.