ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటా – పవన్ కళ్యాణ్

Tuesday, November 17th, 2020, 05:46:03 PM IST

జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పై అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. అధికారం యొక్క అంతిమ లక్ష్యం వేల కోట్ల రూపాయలు కూడగట్టుకోవడం కాదు అని, ప్రజలు కోల్పోయిన వాటిని అందించడమే అంటూ వివరించారు. మంగళగిరి లోని తన పార్టీ కార్యాలయం లో పవన్ కళ్యాణ్ కీలక నేతలతో సమావేశం అయ్యారు. తదుపరి భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు. అయితే రాష్ట్రంలోని సమస్యలను ఎత్తి చూపిస్తే వ్యక్తిగత దూషణకి పాలకులు పాల్పడటం మంచిది కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే దాని పై పాలకులు ఆలోచించాలి అని సూచించారు పవన్. అయితే పాలకులు పరిస్థితులకి అనుగుణంగా మాటలు మార్చుకున్నారు అని తెలిపారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయం లో కూడా ఇదే జరిగింది అని పేర్కొన్నారు. అయితే విభజించి పాలించే విధానం తో పాలకులు ముందుకు వెళ్తున్నారు అని ఆక్షేపించారు పవన్. అయితే తనకు ఏ సమస్య వచ్చినా పారిపోవడం తెలియదు అని, ధైర్యం గా ఎదుర్కొంటా అని పవన్ కళ్యాణ్ అన్నారు.