పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్

Saturday, August 22nd, 2020, 03:00:59 AM IST


వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీగా రైతులు నష్ట పోయారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే వరద ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అని, పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన సంగతి తెలిసిందే, వారికి మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

అంతేకాక పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ముంపు ఇంతలా ఉండేది కాదు అని, వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ముంపు గ్రామాలు దాదాపు 200 కి పైగా ఉన్నాయి అని, దాదాపు 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు అని పవన్ కళ్యాణ్ తన బాధని వ్యక్తం చేశారు. అయితే సరైన వైద్యం అందించాలని, అత్యవసర వస్తువుల జాబితాలో పసిపిల్లల కు పాలు కూడా చేర్చాలి అని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం ను కోరారు.