పురపాలక ఎన్నికలు: ఓటు హక్కు వినియోగించుకున్న పవన్

Wednesday, March 10th, 2021, 10:30:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే విజయవాడ లోని పటమట లో జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే పవన్ ఓటేసెందుకు రావడం తో ఆయన్ను చూసేందుకు అభిమానులు వచ్చారు.

అయితే ఎన్నికల ప్రక్రియ ను విజయవాడ లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అంతేకాక అక్కడ ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి సందర్శించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.

ప్రముఖ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ పట్నం 14 వ వార్డ్ లోని మారుతి నగర్ పోలింగ్ కేంద్రం లో ఓటేశారు. వీరి తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రజా ప్రతినిదులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.