శ్రమైక జీవనమే శ్రీ చిరంజీవి గారి విజయానికి సోపానం – పవన్ కళ్యాణ్

Sunday, August 23rd, 2020, 01:12:13 AM IST


ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం తో చిరంజీవికి అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పలువురు నేతలు మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు జన సేన పార్టీ అధ్యక్షుడు, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకంక్షలు తెలియజేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

శ్రమైక జీవనమే శ్రీ చిరంజీవి గారి విజయానికి సోపానం అంటూ, సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణ వ్యక్తిగా ఆవిర్భవించారు అని తెలిపారు. చిరు తన స్ఫూర్తి ప్రదాత అని, జన్మ నిచ్చిన తల్లి దండ్రులను ఎంతగా ఆరాధిస్తానో, అన్నగారిని కూడా అంతగా ప్రేమిస్తా అని, తన అన్నయ్య, వదిన తల్లిదండ్రుల తో సమానం అని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గా ఎదిగిన తీరు, సేవా గుణం పై సుదీర్ఘ ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన తో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.