ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్

Tuesday, November 24th, 2020, 08:30:22 AM IST

జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ బీజేపీ కీలక నేతల తో చర్చించనున్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరియు తిరుపతి నియోజక వర్గం ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కి పూర్తి మద్దతు అని ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనే దాని పై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అమరావతి రాజధాని అంశం, పోలవరం ప్రాజెక్టు లకు సంబందించిన వివరాలతో పాటుగా మరి కొన్ని కీలక అంశాల గురించి పవన్ బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ ఎన్నికల విషయం లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.