రాజధాని తరలింపు విషయం లో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎటువైపు?

Saturday, August 29th, 2020, 01:39:51 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూడు రాజధానుల నిర్ణయం పై ఒక్కొక్క పార్టీ ఒక్కోక్క నిర్ణయం కి కట్టుబడి ఉంది. ఈ విషయం లో అన్ని పార్టీ ల నిర్ణయం తెలుసుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీ ల యొక్క మనోగతం తెలుసు కొనేందుకు ప్రభుత్వం నిర్ణయానికి కౌంటర్ దాఖలు చేయడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నిర్ణయం పై పవన్ కళ్యాణ్ కాస్త ముందు ఆలోచన తో ఉన్నట్లు తెలుస్తోంది.

కోర్టు ఆదేశాలు ఇంకా అండవలసి ఉన్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ ముందుగానే పార్టీ లోని కీలక నేతలతో ఒక టెలీ సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ సమావేశం లో జన సేన పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం, అంతేకాక రాజధాని అంశం పై చోటు చేసుకుంటున్న పరిణామాల పై చర్చ జరిపే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సమావేశం శనివారం నాడు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.