కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేయడం గర్హనీయం – పవన్ కళ్యాణ్

Thursday, August 27th, 2020, 02:50:45 AM IST


జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా అమరావతి రైతుల విషయం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని రైతులకి వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం అప్రిలో వార్షిక కౌలు చెల్లించాలి అని, కానీ గత ఏడాది కూడా ఆలస్యం గా ఇచ్చింది అని అన్నారు. రెండో ఏడాది కూడా జాప్యం చేస్తూ రైతులను ఆందోళనకి గురి చేస్తోంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

అయితే రాజదాని రైతుల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ను ప్రశ్నిస్తూ, విమర్శలు చేస్తూ పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కౌలు అడిగేందుకు సి ఆర్. డి. ఏ కార్యాలయం కి వెళ్ళిన 180 మంది రైతులను అరెస్ట్ చేయడాన్నీ ఖండిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే తమకు న్యాయం గా రావాల్సిన కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసిన తీరు గర్హనీయం అని పవన్ కళ్యాణ్ తెలిపారు.అయితే రాజధాని ప్రాంతం లో రాజధాని ను నిలుపుకునేందుకు రైతులు 250 రోజులకీ పైబడి పోరాటం చేస్తున్న విషయాన్ని మరొకసారి పవన్ గుర్తు చేశారు.