పవన్, బండ్ల గణేశ్ కాంబోకు దర్శకుడు అతడేనా?

Friday, October 2nd, 2020, 03:53:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాత బండ్ల గణేశ్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్, తీన్‌మార్ సినిమాలకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే తాజాగా తనతో మళ్ళీ సినిమా చేసేందుకు “నా బాస్ ఒకే చెప్పారని” మరోసారి నా కల నిజమయ్యిందని, నా దేవుడు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకి దర్శకుడు ఎవరన్న దానిపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలని చేసేందుకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాల తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పవన్‌ని డైరెక్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పూరి పవన్‌తో బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాలను చేశాడు. అటు నిర్మాత బండ్ల గణేష్ కూడా పూరీతో ఇద్దరమ్మాయిలతో, టెంపర్ అనే సినిమాలను చేశాడు. సో వీరి ముగ్గురి మధ్య ముచ్చటగా మూడో సినిమా అవుతుందని పవన్, బండ్ల కాంబోకు పూరినే దర్శకుడు అని ప్రచారం జరుగుతుంది. కాగా దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.