రుయా లో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం – పవన్ కళ్యాణ్

Tuesday, May 11th, 2021, 10:49:26 AM IST

Pawan_kalyan
తిరుపతి రుయా ఆసుపత్రి లో ఆక్సిజన్ అందకపోవడం మూలంగా 11 మంది కరోనా వైరస్ రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన పట్ల పవన్ కళ్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. అయితే ఊపిరి అందించే వాయువును సక్రమం గా అందించనీ దుస్తితి నెలకొనడం వలనే అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రం అయిన రుయా ఆసుపత్రి లో ఆక్సిజన్ సరఫరా, వైద్య పరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో అవేదన చెందుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారు అంటూ పేర్కొన్నారు.

అయితే కర్నూల్, హిందూపురం లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూ రోగులు ఆక్సిజన్ సరఫరా అందక ప్రాణాలు కోల్పోయారు అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకొలేదు అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విమర్శలు చేయకూడదు అని సంయమనం పాటిస్తున్నాం అని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే పరిస్థితులను చక్క దిద్దాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాద ఘటన లకి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.