కళలకు మరింత జీవం పోసినట్లయింది – పవన్ కళ్యాణ్

Wednesday, January 27th, 2021, 07:37:28 AM IST

పద్మ పురస్కారాల ఎంపిక విషయం లో జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభావంతులకు పట్టం కట్టే విధంగా పద్మా పురస్కారాల ఎంపిక జరిగింది అని పవన్ పేర్కొన్నారు. అయితే గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సినీ సంగీత రంగం పై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెరగని ముద్ర వేశారు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. అయితే మరణాంతరం పురస్కారానికి ఎంపిక చేయడం ఆయన కీర్తిని మరింత పెంచింది అంటూ పవన్ కొనియాడారు.

అయితే ప్రముఖ గాయని చిత్ర కి సైతం పద్మ భూషణ్ అవార్డు ను ఎంపిక చేయడం జరిగింది. అయితే గత నాలుగు దశాబ్దాలు గా దక్షిణాది శ్రోతలతో పాటుగా ఇతర భాషల్లో కూడా తన గళంతో శ్రోతలను మైమరిపించారు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేకాక వయొలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగం విధ్వంసులు సుమతి లతో పాటుగా, ఆశావాది ప్రకాష్ రావ్, ఆదివాసీ ల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న కనకరాజులకి పద్మశ్రీ పురస్కారం లకు ఎంపిక చేయడం కళలకు మరింత జీవం పోసినట్లైంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వారికి పవన్ జనసేన తరపున శుభాకాంక్షలు తెలిపారు.