ఇప్పటి వరకూ 621 ఆక్సిజన్ సిలిండర్లు విరాళం గా ఇచ్చారు – పవన్ కళ్యాణ్

Friday, September 4th, 2020, 11:48:31 PM IST

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జన సైనికులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు విరాళం ఇస్తున్నారు. అయితే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీని పై జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కాపాడటం అంటే మొత్తం కుటుంబాన్ని రక్షించడమే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో ప్రాణాలను కాపాడాలని ఏకైక లక్ష్యం తో ప్రపంచం నలువైపులా నుండి జన సైనికులు ముందుకు వచ్చి ఇప్పటి వరకూ 621 ఆక్సిజన్ సిలిండర్ల ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నీ ప్రభుత్వ ఆసుపత్రులకు, హైదరాబాద్ సిటీ లో ను రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విరాళం గా ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అంతేకాక పవన్ కళ్యాణ్ జన సైనికులను యువతను పొగడ్తలతో ముంచెత్తారు. ఇది యువత యొక్క నిజమైన శక్తి అని, జన సైనికులు తన అతి పెద్ద బలం అని అన్నారు. సామాజిక మార్పు కి ప్రతి నిధులు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ బృహత్కార్యం లో భాగమైన ప్రతిఒక్కరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. మనం చేసే కార్యక్రమాలే బలం గా, స్పష్టంగా మన గురించి చెబుతాయి అంటూ పవన్ పేర్కొన్నారు. అభిమానులు సైతం నువ్వేం మా బలం అన్నయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.