కులమతాలకతీతంగా రాజకీయాలు ఉండాలి – పవన్ కళ్యాణ్

Sunday, January 24th, 2021, 09:31:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రతి పక్ష పార్టీ కి చెందిన పలువురు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సీఎం జగన్ క్రిస్టియన్ అంటూ పలువురు వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మేరకు ఈ అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ క్రిస్టియన్ గా చూడమని, ఒక ముఖ్యమంత్రి గా, ఒక నాయకుడు గానే చూస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి ను ఉద్దేశించి క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ విమర్శించడం సరికాదు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే కులమతాలకతీతంగా రాజకీయాలు ఉండాలని జన సేన భావిస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు పరోక్షంగా ప్రతి పక్ష నేత అయిన చంద్రబాబు పై పవన్ విమర్శలు చేశారు. అయితే సీఎం పలానా మతం, ఇంకొకరు మరోక మతం అంటూ మతాల గురించి తాను మాట్లాడను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జన సేన కార్యకర్త మరణించడం పట్ల పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జన సేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ మీడియా తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.