ఆత్మ నిర్భర్ భారత్ ఏ ఒక్క వర్గానికో కాదు – పవన్ కళ్యాణ్

Friday, August 21st, 2020, 01:52:28 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రజలు మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ అంశం పై జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అందరు కూడా స్వదేశీ ఉత్పత్తులు వాడాలి అని పిలుపు ఇచ్చారు. ఈ వినాయక చవితి నుండి ఈ నినాదాన్ని ముందు కి తీసుకు వెళ్లనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ వినాయక చవితి పండుగ కోసం ఏ వస్తువు కొన్నా అది ఎక్కడ తయారు అయింది అనేది చూడాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు.

మన ఉత్పత్తుల గిరాకీ కోసమే స్వదేశీ నినాదం అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనే నినాదం ఏ ఒక్క వర్గాని కో చెందినది కాదు అని, దేశ ప్రజల అందరి అభివృద్ధికి సంబంధించినది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ది ఆత్మ నిర్భర్ భారత్ అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఈ వినాయక చవితి పండుగ నుండే ఈ నినాదం ను బీజేపీ జన సేన పార్టీ లు సంయుక్తంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళి అవగాహన కల్పించాలి అని నిర్ణయం తీసుకున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలిపారు.