ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ – కారణం ఏంటి…?

Friday, February 14th, 2020, 02:00:18 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని కరుణులు పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు తీర్చడంలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా విఫలమైందని పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా పవన్ తన ఘాటు వాఖ్యలతో ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించారు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న సమయం నుండి కూడా రాష్ట్రంలో కుట్రపూరితంగా రాజకీయాలు చేయడం తప్ప ఏనాడూ కూడా ప్రజాసమస్యల కోసం ఆలోచించలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన రెండు రోజుల కర్నూలు పర్యటన ఎట్టకేలకు పూర్తయిందని చెప్పాలి. అయితే మొదటి రోజు సుగాలి ప్రీతి ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, ఆ కేసుకు సంబందించిన విచారన బాధ్యతలని సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఆ తరువాత రోజు కర్నూలు ప్రాంతంలోని చేనేత కార్మికులు, వారి సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి, ఆ సమస్యలని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, ఎలాగైనా సరే వారి సమస్యలు పరిష్కరించేందుకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్,…