ఆ అంశంపై విమర్శలొద్దు!

Wednesday, May 6th, 2015, 04:40:19 PM IST

pathipati-pularao
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2వ తేదీపై ప్రతిపక్షాలు విమర్శ చెయ్యడం తగదని తెలిపారు. అలాగే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చెయ్యాలని చూస్తోందని తీవ్రంగా ఆరోపించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చెయ్యడం మాని నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. అలాగే జూన్ 2వ తేదీ అవతరణ దినమేనని, అయితే రాష్ట్రం రెండు ముక్కలైన రోజు కాబట్టి ఉత్సవాలు నిర్వహించరాదని సంకల్పించామని ప్రత్తిపాటి తెలిపారు. ఇక ఈ అంశంపై అనవసర వివాదాలు చెయ్యడం విజ్ఞ్యత అనిపించుకోదని ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.