పటాన్ చెరు ఎమ్మెల్యే కి సోకిన కరోనా

Tuesday, August 4th, 2020, 12:12:34 AM IST


కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రం లో రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో పలువురు ప్రజా ప్రతినిదులకి కరోనా సోకగా, తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే నేడు రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ కు కరోనా సోకగా, మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ భారిన పడటం రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.

అయితే మహిపాల్ రెడ్డి తో పాటుగా తల్లి, తమ్ముడు, డ్రైవర్ కి కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ విషయం తెలవడంతో వారు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్న నేపధ్యం లో మరింత అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు చెబుతున్నారు.