కక్షసాధింపులతో వైసీపీ పాలన సాగుతుంది.. పరిటాల సునీత కామెంట్స్..!

Thursday, December 17th, 2020, 12:12:37 AM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని టీడీపీ ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తే, వైసీపీ మాత్రం దోపిడీ పాలనను కొనసాగిస్తుందని అలాగే రాప్తాడును కూడా టీడీపీ ప్రగతి పథంలో నడిపిస్తే, వైసీపీ నేతలు మాత్రం కక్షసాధింపులతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీ భవనాలను టీడీపీ నిర్మిస్తే వైసీపీ నేతలు విధ్వంసాలకు పాల్పడుతున్నారని అన్నారు. అబద్దాలను ప్రచారం చేసుకుంటూ వైసీపీ గాలిలో మేడలు కడుతోందని ఆమె ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దివంగత మాజీమంత్రి రవిపై చేసిన సంచలన వ్యాఖ్యలపై కూడా పరిటాల సునీత సీరియస్ అయ్యారు. పరిటాల రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావని హెచ్చరించారు. నీ చరిత్ర మాకు తెలుసు, నీలా మాట్లాడి మా విలువ తగ్గించుకోలేమని మరోసారి పరిటాల రవి గురుంచి మాట్లాడితే ఊరుకునేది లేదని మాధవ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.