మా టైం వచ్చినప్పుడు మేం ఏంటో చూపిస్తాం – పరిటాల శ్రీరాం

Friday, December 11th, 2020, 03:00:25 AM IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దివంగత మాజీమంత్రి రవిపై చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పరిటాల శ్రీరాం ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేం గల్లీ లెవల్ ఫ్యాక్షనిస్టులం కానీ ఢిల్లీ లెవెల్ రేపిస్టులం కాదని అన్నారు. మీడియా ఫోకస్ కోసం పరిటాల కుటుంబాన్ని విమర్శించడం సరికాదని మాధవ్‌కు సూచించారు.

అయితే ఆనాడు జరిగిన వాస్తవాలను ప్రతి ఒక్కరు చూశారని, ముందు నీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని వైసీపీ చేసినట్లు చూపించడం సిగ్గుచేటని అన్నారు. ఈ రోజు మీ చేతనవుతుందని పేర్లు మారుస్తున్నారని, మా టైం వచ్చినప్పుడు మేం ఏంటో చూపిస్తామని అన్నారు.