వైఎస్సార్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న పంజం సందీప్ రెడ్డి..!

Saturday, August 8th, 2020, 09:59:56 PM IST


దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో వైసీపీ నేతలు వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరై వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో జగన్‌తో పాటు వైసీపీ యువ నేత పంజం సందీప్ కూడా హాజరయ్యారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇళ్లు లేని నిరు పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించేందుకు సీఎం జగన్ శంఖుస్థాపన చేశారు.