ఏడాదిన్నరలో లక్షకోట్లకు పైగా అప్పులు చేసిన ఘనత జగన్‌ది – పంచుమర్తి

Thursday, November 19th, 2020, 06:33:14 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడాదిన్నరలో లక్షకోట్లకు పైగా అప్పులు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో దోపిడీ వర్గమే రాజ్యమేలుతుందని, దళిత మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. 90 మందికి పైగా రాజధాని రైతులు చనిపోయినా సీఎం జగన్‌లో ఏ మాత్రం చలనం లేదని అన్నారు. ఏ ఫర్ అభివృద్ధి, బి ఫర్ భవన నిర్మాణ రంగం, సి ఫర్ క్యాస్ట్, డి ఫర్ దళితులు, ఇ ఫర్ ఎకానమీ నిర్వీర్యమయ్యిందని మండిపడ్డారు.

అయితే సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వం, పోలీసుల వేధింపులే కారణమని అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్న కక్షతోనే వరప్రసాద్, శ్రీకాంత్‌కు శిరో ముండనం చేశారని అన్నారు. టీడీపీ సానుభూతి పరులకు ప్రభుత్వ పథకాలు వర్తించకుండా వేధిస్తున్నారని అన్నారు. అరాచకాల్లో ఏపీ బీహార్‌ను మించిపోయిందని అన్నారు.