మా ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండలేక పార్టీని వీడాం – పంచకర్ల రమేష్ బాబు

Friday, August 28th, 2020, 06:05:29 PM IST

తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తన అనుచరుల తో కలిసి నేడు వైసీపీ లో చేరారు. అయితే పార్టీ లో చేరిన అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర పై చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయిదు నెలల క్రితం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూడు రాజధానుల నిర్మాణం కోసం సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అభివృద్ది వికేంద్రీకరణ కి వ్యతిరేకంగా ధర్నాలు చేయాలి అని చంద్రబాబు మమ్మల్ని రెచ్చగొట్టారు అని ఆరోపించారు. మా ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండలేక పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ది వికేంద్రీరణ స్వాగతించాము అని, సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ను రాష్ట్ర ప్రజలు అందరు కూడా స్వాగతించారు అని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు, అయితే ఇంకా వైసీపీ లోకి చాలామంది టీడీపీ నేతలు వచ్చే పరిస్థతి ఉంది అని అన్నారు. అయితే నారా లోకేష్ పై కూడా పలు ఘాటు విమర్శలు చేశారు.లోకేష్ నాయకుడి గా పనికి రాడు అని టీడీపీ నేతలు అందరం చెప్పాం, బాబు లోకేష్ ను దొడ్డి దారిన మంత్రిని చేసి పెత్తనం చెలయించెలా చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.