నోటీసులపై ఎందుకు ఆందోళన?

Saturday, June 20th, 2015, 09:25:15 PM IST


ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాధరెడ్డి శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టప్రకారమే విశాఖ పోలీసులు టీన్యూస్ కు నోటీసులు ఇచ్చారని, నోటీసులు ఇవ్వడం ఎందుకు తప్పో చెప్పాలని నిలదీశారు. అలాగే నోటీసులపై ఎందుకు ఆందోళన చెందుతున్నారని?, టీన్యూస్ వివరణ ఇచ్చుకోలేదా? అంటూ పల్లె ప్రశ్నించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చే టేపులు ప్రసారం చేసినప్పుడు వాటిపై నిజానిజాలు వెల్లడించగలగాలని సూచించారు. అలాగే నోటీసులు ఇవ్వడం తప్పుకాదని, అది మీడియా స్వేచ్చను ఉల్లంఘించినట్లు కాదని పల్లె స్పష్టం చేశారు. ఇక ఏసీబీ అధికారులు తామెవరికీ టేపులను ఇవ్వలేదని చెబుతున్న నేపధ్యంలో ఆడియో టేపులు టీన్యూస్ కు ఎక్కడ నుండి వచ్చాయని? ఎవరిచ్చారని? ఎవరు ప్రసారం చెయ్యమని చెప్పారని? పల్లె రఘునాధరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.