దమ్ముంటే తప్పని నిరూపించు.. బండి సంజయ్‌క్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్..!

Wednesday, February 24th, 2021, 01:08:54 AM IST


తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆరేళ్లుగా టీఆర్ఎస్ చేస్తున్న అభివృది సంక్షేమ కార్యక్రమాలను చూసి పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కట్టబోతున్నారని అన్నారు. అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్న బండి సంజయ్ మాటలను ప్రజలు విశ్వసించరని, అలాంటి వారికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పల్లా అన్నారు.

అయితే లక్ష 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని, 2 లక్షలు మంది ఐటీ ఉద్యోగాల్లో చేరారని దేశంలో ఏ రాష్ట్రాలి చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసిందని అన్నారు. అయితే బండి సంజయ్‌కి నిజంగా దమ్ముంటే, నీతి ఉంటే నేను చెప్పిన ఉద్యోగాల కల్పన లెక్కలు తప్పని నిరూపించాలని పల్లా సవాల్ విసిరారు. మీలా ఇష్టమొచ్చినట్లు మేము తిడితే ఆ జడివానలో మీరు కొట్టుకుపోతారని పేర్కొన్నారు. పట్టభద్రులకు ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు మేము చేసి తీరుతామని, చాలామంది ప్రశ్నించే గొంతులు అంటూ ముందుకు వస్తున్నారని అసలు తెలంగాణ రావడంతోనే ఆ ప్రశ్నలకు సగం సమాధానం వచ్చిందని ఇక మిగిలిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిస్తారని పల్లా చెప్పుకొచ్చారు.