డబ్బులు అడిగితే చెట్టుకు కట్టేయండి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Thursday, December 31st, 2020, 05:21:24 PM IST

చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే ఎన్. వెంకటే గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలందరికి అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులుగా ఉన్నా నాయకులు, లేదా అధికారులు మీ నుంచి డబ్బులు అడిగితే వారిని చెట్టుకు కట్టేయాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు అలాంటి వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించదని అన్నారు. డబ్బులు డిమాండ్ చేసినందుకు చెట్టుకు కట్టేసి తర్వాత పోలీసులు, లేదా తనకైనా సమాచారం ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం లబ్దిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి ఘటనలు ఏమైనా జరుగుతుంటే తనకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అర్హులైన పేదలందరికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలన్న ధృడ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారని అన్నారు.