ముర్ఖులుగా మిగిలి పోకండి…అలాంటి వాటిని దయచేసి నమ్మకండి – పాక్ ప్రధాని

Sunday, April 5th, 2020, 10:32:01 PM IST


ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి, పాక్ నీ సైతం వదలలేదు. ఇప్పటివరకు పాకిస్తాన్ లో 2,818 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా, ఈ వైరస్ భారిన పడి ఇప్పటివరకు 41 మంది మరణించారు. అయితే కరోనా రిలీఫ్ ఫండ్ నీ ప్రారంభించిన అనంతరం పాక్ ప్రధాని పలు వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియా లో వస్తున్న వదంతులను నమ్మొద్దని, ఈ కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ నీ పాటించని వారిని వదిలి పెట్టదు అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం తన వద్ద కు వచ్చిందని వివరించారు. అల్లా పాక్ ప్రజలకు కరోనా రాకుండా చేశారు అని ప్రచారం జోరుగా సాగుతోంది అంటూ వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా లో వస్తున్న అసత్య కథనాలు, అసలు నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. కరోనా ఎవరిని విడిచి పెట్టదు అని వ్యాఖ్యానించారు. పాక్ ప్రజలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉంటారని, వారికి కరోనా రాదని, వచ్చినా ఎం కాదు అనే భావన సరైంది కాదు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ నేపధ్యంలో ప్రపంచ అగ్ర దేశాల్లో ఒకటైన న్యూ యార్క్ సిటీ ఎంతో మంది ధనికులు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్తితి చూడండి అని అన్నారు. మనకి ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురు అయిందని, దీన్ని సమర్దవంతంగా ఎదుర్కొని విజయం సాధించాలని అన్నారు. అయితే ఈ సమయంలో ముర్కులుగా ప్రవర్తించ
చరిత్రలో నిలిచి పోకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.