భారీ విమాన ప్రమాదం : పాక్ లో ఇళ్ళ పై కుప్పకూలిన విమానం..!

Friday, May 22nd, 2020, 05:29:03 PM IST

పాకిస్తాన్ లో భారీ విమాన ప్రమాదం జరిగింది. కరాచీలో జిన్నా విమాాశ్రయానికి దగ్గరలో రెసిడెన్స్ ప్రాంతంలో ఇళ్ళ పై విమానం కుప్ప కూలింది. అయితే విమానం ల్యాండ్ అయ్యే కొద్దిసేపట్లో మోడల్ కాలని లో pk 8303 కుప్ప కూలింది. అయితే ఈ విమానం లో 107 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ప్రయాణికులు 91 మంది కాగా, మిగతా విమాన సిబ్బంది అని తెలుస్తోంది.

అయితే విమానం కుప్ప కూలిన ప్రాంతంలో నల్లని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే దాదాపు 8 నుండి 10 ఇళ్లు ఈ ప్రమాదం లో డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది. అయితే అక్కడి ప్రాంతంలో ఉన్న వాహనాలు, మరియు ఇళ్లు దగ్దం అయ్యాయి. ఆస్తి నష్టంతో పాటుగా, భారీ ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఘటన పై అక్కడి ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు పూర్తిగా ప్రాణ నష్టాన్ని అంచనా వేయలేక పోతున్నారు. ఒక నాలుగు ఇళ్లు మాత్రం పూర్తి స్థాయిలో దగ్దం అయ్యాయి.ఘటన ప్రాంతానికి సహాయ చర్యల నిమిత్తం ఆర్మీ, పోలీస్ బృందాలు ఘటన స్థలికి చేరుకున్నాయి.