కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్..!

Wednesday, August 26th, 2020, 01:00:41 AM IST


కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి పాకిస్థాన్ హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ఆయన పర్స్‌నల్ వెబ్‌సైట్ Kishanreddy.com ను పాకిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ నెల 15వ తేది స్వాతంత్య్ర దినోత్సవం రోజు కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు సమాచారం.

అయితే కశ్మీర్ స్వాతంత్ర్యం, పాకిస్తాన్‌కు సంబంధించిన సందేశాన్ని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఇది జరిగి 15 రోజులవుతున్నా ఆ వెబ్‌సైట్ అందుబాటులోకి రాలేదు. దీని కోసం సైబర్ నిపుణులు పనిచేస్తున్నారు. అయితే ఈ వెబ్‌సైట్‌లో భారత ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి డేటా లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి కార్యాలయం వెల్లడించింది.