టీమిండియా స్కోర్ 369 గా కనిపించింది – అక్తర్

Sunday, December 20th, 2020, 12:30:48 PM IST

అడిలైడ్ వేదిక గా ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి పింక్ టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలయ్యింది. ఊహించని రీతిలో సెకండ్ ఇన్నింగ్స్ ను అతి తక్కువ పరుగుల తో ముగించింది. కేవలం సింగిల్ డిజిట్ కే పరుగులు నమోదు కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యం లో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు స్పందించారు. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు అయిన పాట్ కమిన్స్, జోష్ హజిల్ఉడ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు అని, చాలా ఏళ్ళ తర్వాత అసలైన టెస్ట్ బౌలింగ్ చూసా అంటూ అఫ్రిది పేర్కొన్నారు. అయితే టీమ్ ఇండియా కోలుకునే అవకాశం ఉందని, కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా అది చాలా కష్టం అంటూ పేర్కొన్నారు.

అయితే మరొక మాజీ ఫాస్ట్ బౌలర్ అక్తర్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. శనివారం నిద్ర లేచి చూసే సరికి టీమ్ ఇండియా స్కోర్ 369 గా కనిపించింది అని, దాన్ని నమ్మలేక పోయా అని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత తేరుకుని చూస్తే 36/9 అని స్పష్టం అయింది అంటూ వ్యాఖ్యానించారు. అయితే టీమ్ ఇండియా తేలిగ్గా ఈ ఇన్నింగ్స్ ను మర్చిపోదు అంటూ అక్తర్ చెప్పుకొచ్చారు. టీమ్ ఇండియా ఇక్కడి నుండి బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ కైఫ్ మాత్రం ఫోన్ లని స్విచ్ ఆఫ్ చేసి, పట్టించుకోవద్దు అంటూ సూచిస్తున్నారు.