గుజరాత్ తీరంలో పాక్ పడవ!

Tuesday, April 21st, 2015, 03:02:03 PM IST

boat
గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ తీరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్తాన్ కు చెందిన పడవను సోమవారం భారత నావికాదళం గుర్తించింది. ఇక ఈ పడవలో 100కిలోల హెరాయిన్, 8మంది స్మగ్లర్లుగా అనుమానిస్తున్న వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఇక భారత జలాల్లో ఆ పడవ ఎందుకు సంచరిస్తోందన్న విషయంపై నేవీ అధికారులు ఆ పడవను పోరుబందరుకు తీసుకెళ్ళి విచారిస్తున్నారు.

ఇక గుజరాత్ తీరంలో అలజడి సృష్టించేందుకే పాకిస్తాన్ ఇలాంటి పడవలను పంపుతోందనే వాదనలు కూడా విమిపిస్తున్నాయి. కాగా ఇదే తరహాలో డిసెంబర్ 31, 2014లో ఒక పడవ గుజరాత్ తీరంలోకి వచ్చి నేవీ సేన వెంబడించడంతో తమ పడవను తామే పేల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గత మూడు రోజులుగా రెండు నేవీ నౌకలు, ఒక కోస్ట్ గార్డ్ నౌక భారత జలాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ పడవను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ పడవలో వచ్చిన వారు తీవ్రవాద దాడులు జరపడానికా? లేదా అసాంఘిక కార్యకలపాల కోసమా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.