రేవంత్ రెడ్డి నాకు బాగా దగ్గరోడు – పద్మారావు గౌడ్

Wednesday, February 17th, 2021, 11:53:52 AM IST

తెలంగాణ రాష్ట్రం లో అధికార తెరాస పార్టీ పై వరుస విమర్శలు చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన విధానం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసే రేవంత్ రెడ్డి పట్ల తెరాస నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చంశనీయం గా మారింది. రేవంత్ ఉన్నాడా, నాకు బాగా దగ్గరోడు అంటూ తెరాస నేత, తెలంగాణ రాష్ట్ర ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. లాలపేట లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి, పద్మారావు గౌడ్ మాట్లాడుతున్నారు. అయితే ఈ సమయం లో తార్నాక వైపు వెళ్తున్న రేవంత్ రెడ్డి వాహనాలను చూసి తన ప్రసంగాన్ని ఆపారు. అయితే అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడా, నాకు బాగా దగ్గరోడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పద్మారావు చేసిన వ్యాఖ్యల పట్ల అక్కడి కార్యక్రమానికి వచ్చిన వారు, కార్యకర్తలు ఈ అంశం గురించి చర్చలు జరిపారు.