రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నా గా ప్రచారం చేస్తారా?

Friday, November 27th, 2020, 08:45:25 AM IST

ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ అసదుద్దీన్ బీజేపీ నేతల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు అని, కానీ ఇప్పుడు దాన్ని ఒక మతం తో జొడిస్తున్నారు అని అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మజ్లిస్ మతతత్వ పార్టీ అంటూ తప్పుడు గా ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. తమ పార్టీ హక్కుల కోసమే పోరాడుతుంది అని, మనసుల్ని కలిపే ప్రయత్నం చేస్తుంది అని, మనసుల్ని విడగొట్టేలా చేయదు అని అసదుద్దీన్ అన్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎర్రగడ్డ నిర్వహించిన ఒక సభ లో ఆయన మాట్లాడారు.

1960 నుండి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీని దేశ వ్యతిరేక పార్టీగా బీజేపీ ఆరోపిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే స్థానిక ఎన్నికల్లో ప్రజా సమస్యల గురించి కాకుండా, రోహింగ్యా, ఉగ్రవాదం, సర్జికల్ దాడుల పై మాట్లాడుతున్నారు అని అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తనను జిన్నా గా ప్రచారం చేస్తున్నారు అని, రాజ్యాంగ బద్దంగా మాట్లాడితే జిన్నా గా ప్రచారం చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో వరదలు వస్తే సహాయం చేసేందుకు ఎవరూ రాలేదు కానీ, ఓట్ల కోసం మాత్రం క్యూ కడుతున్నారు అంటూ సెటైర్స్ వేశారు. ఎన్నారకి దేశవ్యాప్తంగా 200 కార్పొరేషన్లు వ్యతిరేకంగా తీర్మానం చేసినందుకే బీజేపీ నేతల దృష్టి హైదరాబాద్ పై పడింది అంటూ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.