ఘర్ వాపసీపై రాజ్యసభలో రగడ

Monday, December 15th, 2014, 06:20:58 PM IST


ఉత్తరప్రదేశ్ మత మార్పిడిల అంశంపై ఈ రోజు కూడా రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. బీజేపి దేశవ్యాప్తంగా మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నదని…ప్రజలలో హిందుత్వాన్ని బలంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సభలో పోడియం వద్దకు వచ్చి బీజేపికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో… రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ఘర్ వాపసీ అంటూ ఉత్తరప్రదేశ్ లో ముస్లిం మతం స్వీకరించిన వారిని తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానం పలికిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ఇలా ఉంటే ఉత్తర ప్రదేశ్ వివాదాస్పద ఎంపి ఆదిత్యానాథ్ ఘర్ వాపసీని ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఘర్ వాపసీ వివాదం పార్లమెంట్ ను కుదిపేస్తుంటే… మరోవైపు ఘర్ వాపసీని ఆమోదించాలని ఆదిత్యానాథ్ పట్టుబట్టటం మరిన్ని వివాదాలకు తెరతీస్తున్నది.