కరోనా ఎఫెక్ట్: ఒంటిమిట్ట ఆలయం మూసివేత

Friday, April 16th, 2021, 12:04:38 PM IST

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దీని తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఒంటిమిట్ట ఆలయం మూసివేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి ఒంటిమిట్ట లోని కోదండ రామ స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండటం తో కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే త్వరలో శ్రీరామ నవమి రానున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుక నిర్వహిస్తారా లేదా అనేది చర్చంశనీయంగా మారింది.