బిగ్ న్యూస్: మరొకసారి రద్దు అయిన ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం

Thursday, November 19th, 2020, 11:52:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం రద్దు కాగా, మరొకసారి రద్దు కావడం తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కి ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు. అయితే కలెక్టర్లు, జెడ్పీ సీఈవో లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమావేశం విషయమై లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల పై చర్చించేందుకు సమావేశం అవ్వాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అయితే అధికారులకు సమావేశం లో పాల్గొనేందుకు అనుమతి లేకపోవడం తో వరీతర పనుల్లో బిజీగా ఉండగా, ఎన్నికల కమిషనర్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఎన్నికలు ఫిబ్రవరి లో నిర్వహించే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టాక ఎన్నికలు నిర్వహిస్తే మంచిది అని పేర్కొనడం జరిగింది. అయితే ఇంకా అనుమతి రాకపోవడం తో ఎస్ ఈ ఎస్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంతుందో చూడాలి.