ఏపీలో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళిన దుండగుడు.. చివరకు ఏమైందంటే..!

Friday, May 22nd, 2020, 08:44:29 PM IST

ఏపీలో ఓ దొంగ ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్ళాడు. అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన AP02Z0552 నంబరు గల బస్సును కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిపోయాడు. అయితే బస్సును మరమత్తు చేసిన సిబ్బంది భోజనానికి వెళ్ళగా అక్కడికి చేరుకున్న దొంగ ఆ బస్సును తీసుకుని పారిపోయాడు.

అయితే ఖాళీ బస్సుతో ధర్మవరం నుంచి ణ్శ్ గేటు, చెన్నేకొత్తపల్లి, గుట్టూరు మీదుగా బెంగళూరు వెళ్లడానికి ప్లాన్ చేసుకోగా, బస్సు మిస్ అయిన విషయం ఆర్టీసీ అధికారులు పోలీసులకు తెలియచేయడంతో పోలీసులు వెంటనే చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. అయితే కియా కంపెనీ వద్ద బస్సును ఆపిన పోలీసులు నిందితుడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే దుండగుదు అసలు బస్సు ఎందుకు ఎత్తుకుని వెళ్ళాడనేది తెలియాల్సి ఉంది.