భారత్ లో కోటి మందికి కరోనా వైరస్ వాక్సిన్

Friday, February 19th, 2021, 02:42:43 PM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం నుండి పాజిటివ్ కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా చాలా తగ్గుముఖం పట్టింది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ కోటి మందికి ఈ వాక్సిన్ అందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఇటు భారత్ లో మాత్రమే కాకుండా, ఇతర దేశాలకు సైతం వాక్సిన్ సరఫరా చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తెలిపారు. అయితే ప్రపంచం లో నే భారత్ వాక్సినేషన్ ప్రక్రియ లో దూసుకుపోతుంది.