బిగ్ న్యూస్: కోటి కి చేరిన కరోనా వైరస్ రికవరీ ల సంఖ్య

Thursday, January 7th, 2021, 11:00:08 AM IST

కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది పూర్తి అయినా దీని ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇతర దేశాల్లో దీని తీవ్రత ఇంకా ఎక్కువగానే కొనసాగుతూనే ఉన్నా, భారత్ మాత్రం ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 19,587 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. తాజాగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య కోటి దాటింది. మొత్తం 1,00,16,859 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో ప్రస్తుతం 96.36 శాతానికి పెరిగింది. అయితే కరోనా వైరస్ రికవరీ మెరుగ్గా ఉండటం ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.

గడిచిన 24 గంటల్లో మరో 9,37,590 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 20,346 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,03,95,278 కి చేరింది. అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 222 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,50,336 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 2,28,083 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.