మరోసారి పవన్ కళ్యాణ్, బండ్ల గణేశ్ కాంబినేషన్..!

Monday, September 28th, 2020, 01:15:18 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బండ్ల గణేశ్ కాంబినేషన్ మరోసారి రాబోతుంది. అయితే తనతో సినిమా చేసేందుకు “నా బాస్ ఒకే చెప్పారని” మరోసారి నా కల నిజమయ్యిందని, నా దేవుడు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. అయితే ఇది వరకే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్, తీన్‌మార్ సినిమాలకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే మూడో సినిమా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం పవన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు మరియు బోణీ కపూర్ కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో, మరియు హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.