ఛాతీ నొప్పితో మళ్ళీ ఆసుపత్రి లో చేరిన గంగూలీ

Wednesday, January 27th, 2021, 04:11:25 PM IST

భారత్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరొకసారి ఛాతీ నొప్పి తో ఆసుపత్రి లో చేరారు. బుధవారం నాడు సౌరవ్ కి ఛాతీ లో నొప్పి రావడం తో కొల్కోతా లోని అపోలో ఆసుపత్రి కి ఆయనను తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల గుండె పోటు తో ఆసుపత్రి లో చేరి చికిత్స తీసుకోని కోలుకున్న సౌరవ్, మరోమారు ఆసుపత్రి లో చేరడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.అయితే నొప్పి స్వల్పం గా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రి కి ఆయనను తరలించినట్లు తెలుస్తోంది.