బిగ్ న్యూస్ : ఏపీలో మరోసారి శానిటైజర్ తాగి మృతి చెందిన నలుగురు.!

Saturday, August 8th, 2020, 08:03:51 AM IST

ఎవరిని కంట్రోల్ చేసినా మందు బాబులను మాత్రం కంట్రోల్ చెయ్యడం ఎవరి వల్లా కావడం లేదు. ఏపీలో అయితే ఎండా వానా అని తేడా లేకుండా భారీ సంఖ్యలో ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా నిలబడుతూ షాకిస్తున్నారు. అయితే ధరలు పెరిగినా మందు దొరికి తాగే వారూ ఉన్నారు.

కానీ మందు దొరక్క డబ్బుల్లేని వారు మాత్రం తమ అమాయకత్వంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత కొన్ని రోజుల కితమే 12 మంది శానిటైజర్ తాగి ప్రాణాలు వదిలిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటన మరువక ముందే మరో నలుగురు ఆల్కహాల్ కి బానిసై శానిటైజర్ తాగి వారి ప్రాణాలు బలిగొన్నారు. తిరుపతి స్కావెంజర్స్ కాలనీకి చెందిన వీరు ఈ శానిటైజర్ తాగి చనిపోయారు.