బ్రేకింగ్ : తెలంగాణలో మరోసారి రికార్డు స్థాయి కేసులు.!

Thursday, August 6th, 2020, 09:55:38 AM IST

ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభణ అలా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రతీరోజు రికార్డు కేసులు నమోదు అవుతుండగా ఈసారి మళ్ళీ అదే పంథాలో కేసులు నమోదు అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి మినిమమ్ 20 వేల టెస్టులు చేస్తే అంతే స్థాయిలో సగటున 2 వేలు దగ్గరకు కేసులు నమోదు అవుతున్నాయి.

అలాగే ఈసారి కూడా నమోదు అయ్యినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. గత 24 గంటల్లో అక్కడ 21 వేల 346 టెస్టులు నిర్వహించగా 2 వేల 96 కేసులు నమోదు అయ్యినట్టుగా నిర్ధారణ అయ్యింది. అలాగే 13 మరణాలు నమోదు కాగా మొత్తం 1289 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉండగా ఈ మొత్తం కేసులలో జిహెచ్ఎంసి పరిధిలో 535 అలాగే మేడ్చల్ లో 126, రంగారెడ్డిలో 169, కరీంనగర్ లో 123 కేసులు భారీ ఎత్తున నమోదు అయ్యాయి. దీనితో తెలంగాణలో ఇప్పటి వరకు 73 వేల 50 కేసులకు సంఖ్య చేరుకుంది.