బిగ్ బ్రేకింగ్ : తెలంగాణాలో కొనసాగుతున్న రికార్డు స్థాయి కరోనా కేసులు..!

Friday, August 7th, 2020, 09:00:46 AM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది. టెస్టులు చేస్తున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే రికవరీ రేటులో కూడా కేవలం టెస్టుల పరంగా చూసినట్లయితే పెద్ద గొప్ప ఫిగర్స్ నమోదు కావడం లేదని చెప్పాలి.

కానీ తెలంగాణలో మాత్రం రికవరీ రేట్ పర్లేదని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణలో నమోదు అయిన లేటెస్ట్ లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసారు. గడిచిన 24 గంటల్లో 22 వేల 395 శాంపిల్స్ పరీక్షించగా అందులో భారీగా 2207 కేసులు మరోసారి రికార్డు స్థాయిలో నమోదు అయ్యినట్టుగా నిర్ధారణ అయ్యింది.

అలాగే గత 24 గంటల్లోనే 1136 మంది పూర్తిగా రికవర్ కాగా 12 మంది మరణించారు. అయితే ఈ భారీ కేసుల సంఖ్యలో జిహెచ్ఎంసి పరిధిలో 532 కేసులు మరోసారి మేడ్చల్ లో భారీ ఎత్తున 136 కేసులు అలాగే రంగారెడ్డి లో 196 కేసులు భారీ ఎత్తున నమోదు అయ్యాయి.

ఇక మిగతా ఏ జిల్లాలో కూడా కేసుల సంఖ్య మూడు డిజిట్లు దాటకపోవడం కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. అయితే తాజాగా నమోదు అయ్యిన ఈ కేసులతో తెలంగాణాలో మొత్తం కేసులు సంఖ్య 75 వేల 257 కు చేరుకున్నట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు తెలిపారు.