బిగ్ న్యూస్ : వద్దని తీసేసిన ప్రభుత్వం చేతే నియమించుకున్న నిమ్మగడ్డ.!

Friday, July 31st, 2020, 08:51:19 AM IST

ఏపీలో కరోనా ప్రబలుతున్న ఆదిలోనే స్థానిక ఎన్నికలు రద్దు చేసి చాలా కీలక పాత్ర పోషించిన ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విధుల్లో నుంచి ఏపీ ప్రభుత్వం తొలగించిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఆయన మాకు వద్దంటే వద్దని గట్టిగా పట్టుబట్టారు.

అలాగే ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా హై కోర్ట్ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లగా అఫు తిరిగి ఇటుతిరిగి చివరికి ఏపీ ప్రభుత్వానికే ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే ఈ అంశం మాత్రం గత కొన్ని రోజుల నుంచి ఏపీలో అలా హాట్ టాపిక్ గా నడుస్తూనే వచ్చింది.

అయితే ఇప్పుడు మొత్తానికి ఆయన్ను తిరిగి విధుల్లోకి నియమిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ని హై కోర్ట్ ఉత్తర్వులు మేరకు రాష్ట్ర గవర్నర్ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా తిరిగి నిమ్మగడ్డ నియమితులు అయ్యారు.