బిగ్ న్యూస్ : మరోసారి భారత్ లో భారీ ఎత్తున కరోనా కేసులు..!

Thursday, July 9th, 2020, 10:39:48 AM IST

మన దేశంలో ఇప్పుడు కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా ప్రతీ రోజు అంతకంతకు లెక్కలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఒకే సారి 10 వేల మార్క్ నుంచి భారీ ఎత్తున 20 వేల మార్కును కరోనా కేసులు దాటేశాయి. అలాగే ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున కరోనా కేసులు భారత్ లో నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది.

నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 24 వేల 879 కేసులు నమోదు కాగా 487 మంది మరణించారు. ఈ కొత్త కేసులతో భారత్ లో మొత్తం 7 లక్షల 67 వేల 296 కేసులు కు చేరుకుంది. అలాగే గత 24 గంటల్లో 19 వేల 547 మంది పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరి మనదేశంలో మున్ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.