బ్రేకింగ్ : తెలంగాణాలో మరోమారు రికార్డు స్థాయి కరోనా కేసులు.!

Saturday, August 1st, 2020, 10:50:11 AM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఏ స్థాయిలో నమోదు అవుతున్నాయి అందరికీ తెలియనిది కాదు. ఎన్ని టెస్టులు అయితే చేస్తున్నారో అంతే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణాలో ఇప్పుడు తాజాగా నమోదు కాబడిన కేసులు లెక్కలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారికంగా విడుదల చేసారు. గడిచిన 24 గంటల్లో 21 వేల 11 శాంపిల్స్ ను పరీక్షించగా ఈసారి ఏకంగా 2 వేలు మార్కును టచ్ చేసింది.

గత 24 గంటల్లో 2 వేల 83 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో తెలంగాణాలో ఇప్పటి వరకు 64 వేల 786 కేసులు నమోదు అయ్యినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. అలాగే గత 24 గంటల్లో మంది సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడగా 11 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ అన్నిటిలో మొత్తం కేసులలో జిహెచ్ఎంసి లో 578 కేసులు నమోదు కాగా మేడ్చల్ మరియు రంగారెడ్డి లలో 197,228 కరీంనగర్ మరియు సంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో 100 కు పైగా కేసులు నమోదు అయ్యాయి.