తెలంగాణలో భారీ వర్ష సూచనతో ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు

Monday, October 19th, 2020, 12:43:05 PM IST

తెలంగాణలో భారీ వర్ష సూచనతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మీర్ పేట్ చెరువు ప్రమాదకర పరిస్థితికి చేరుకుందని తెలుస్తోంది. చెరువు ఏ క్షణం లో అయిన తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చెరువు పక్కన ఉన్న స్మశాన వాటికలో నుండి పారుతున్న అలుగు మరింత ఆందోళన కి గురి చేస్తోంది. అయితే చెరువు కట్ట తెగకుండా, బస్తలతో మట్టి నింపుతూ, సిబ్బంది చర్యలు తీసుకుంటుంది. మీర్ పేట్ చెరువు కట్ట కింది వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 60 శాతం కి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే తాజాగా మరొకసారి తెలంగాణ రాష్ట్రం లో భారీ వర్షాల సూచనతో ప్రజలు ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది.