ఓల్డ్ మలక్ పేట్ లో ఎల్లుండి రీ పోలింగ్

Tuesday, December 1st, 2020, 01:31:38 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపద్యం లో పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఓల్డ్ మలక్ పేట లో డివిజన్ అభ్యర్థుల పార్టీ గుర్తులు తారు మారు అయ్యాయి. అయితే బ్యాలెట్ పత్రం లో సీపీ ఐ పార్టీ అభ్యర్ధి పేరు ఎదురుగా సీపీ ఎం పార్టీ గుర్తు ముద్రించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గమనించిన సీపీ ఐ నేతలు పోలింగ్ ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. అయితే దీని పై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్ పేట లోని కేంద్రాల్లో పోలింగ్ ను నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఓల్డ్ మలక్ పేట లోని 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీ పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం తో ఎక్జిట పోల్స్ ను నిషేధించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటల వరకు 8.9 శాతం జరిగింది.