బీహార్ లో చెలరేగిన మతఘర్షణలు

Monday, January 19th, 2015, 05:25:29 PM IST


బీహార్ లోని ముజఫర్ పూర్ లో మతఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో ముగ్గురు సజీవ సమాధి అవ్వగా, మరికొంత మందికి గాయాలయ్యారు. ఇక ఈ ఘటనలో దాదాపు 14మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాలలోకి వెళ్తే…

బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ లో ఒక వర్గానికి చెందిన యువతి మరో వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. అంతేకాకుండా, ప్రేమించిన వ్యక్తీతోలేచిపోయింది. అయితే, ఆ ప్రేమించిన వ్యక్తీని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రేమికుడి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు గొడవకు దిగారు. అజీజ్ పూర్ గ్రామంపై దాడి చేసి, ఇళ్ళకు నిప్పంటించారు. ఈ ఘటనలో దాదాపు ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఇక ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని ముజఫర్ పూర్ డిఎం అనుపమ్ కుమార్ తెలియజేశారు.