థియేటర్లు, ప్రార్థన స్థలాలు అక్టోబర్ 31 వరకు బంద్

Friday, October 2nd, 2020, 10:03:17 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి కారణం గా లాక్ డౌన్ ను అమలు చేస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే ఆర్ధిక పరిస్తితి మెరుగు పరుచుకోవడానికి అన్ లాక్ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే ఆన్ లాక్ 5.0 లో ఎంటర్ టైన్మెంట్ ప్రదేశాలతో పాటుగా, స్విమ్మింగ్ పూల్స్, ధియేటర్స్ ఇంకా తదితర పునః ప్రారంభం కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒడిష ప్రభుత్వం మాత్రం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఒడిషా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాల్లో కొన్నిటికి చుక్కెదురైంది. ప్రార్ధనా స్థలాలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ ఎంటర్ టైన్మెంట్ కాంప్లెక్స్ లతో పాటుగా, థియేటర్లు, ఆడిటోరియం లు కూడా అక్టోబర్ 31 వరకు మూసివేయడం ఉంటుంది అని అందులో పేర్కొనడం జరిగింది. అంతేకాక స్కూల్స్, కాలేజెస్ విద్యా సంబంధిత ప్రదేశాలు కూడా ఈ నెల 31 వరకు మూసి వేసి ఉంచడం జరుగుతున్నట్లు తెలుస్తోంది.